శెనగపలుకుల పచ్చడి

హాయ్ ఫ్రెండ్స్ .గుడ్ ఆఫ్టేర్నూన్.మన ఇండియన్  భోజనాలలో పచ్చడులకు ఒక ప్రత్యేకమయిన స్థానం ఉంది అని మన అందరికి తెల్సు.ఎహ్ శుభకార్యం జరిగిన కచ్చితంగా అందులో ఎదో ఒక పచ్చడి గాని ఆవకాయ గాని వడ్డిస్తారు.
నాకు పచ్చడులు అంటే చాల ఇష్టం అందుకే నేను ఇంట్లో తీరికగా ఉన్నపుడు రకరకాల పచ్చడులు చేస్తుంటాను.

ఈ రోజు మీ అందరికి  నాకు ఎంతో ఇష్టమయిన పచ్చడిని పరిచయం చేయాలి అనుకుంటున్నాను.ఈ పచ్చడి చేయడానికి కేవలం 5 పదార్ధాలు ఉంటె చాలు.ఇది తయ్యారు చెయ్యడానికి కేవలం 15 నిమిషములు పడుతుంది.

ఇంతకీ ఎహ్ పచ్చడి చెప్తాను అని ఆలోచిస్తున్నారా ?

ఆలోచించండి ..,

ఆలోచించండి ...

సరే మీకు ఒక క్లూ ఇస్తాను ..ఇందులోని ముఖ్యమయిన పదార్ధము  మొదటి అక్షరం "శె" మరియు ఆఖరి అక్షరం "లు".
సరే ఇంకా పచ్చడి పేరు చెప్పేస్తున్నాను  ---" శెనగపలుకుల పచ్చడి"

మరి ఇంకెందుకు ఆలశ్యం , ఈ పచ్చడి ఎలా తయ్యారు చేసుకోవాలో చూదాంరండి.

కావలసిన పదార్ధాలు :

  1. శెనగపలుకులు  -- 1  కప్పు
  2. ఆవాలు -- 1 టీస్పూన్
  3. పచ్చిమిరపకాయలు -- 5 / 6 
  4. చింతపండు -- చిన్న నిమ్మకాయ సైజు 
  5. ఉప్పు -- 1 టేబులుస్పూన్ 
  6. నూని -- 2 టేబులుస్పూన్ 
  7. కరివేపాకు -- 5  ఆకులు

తయారీ విధానం :
1. ముందుగా ఒక పాన్ తీసుకోని స్టవ్ మీద పెట్టి, అందులో శెనగపలుకులని వేసి,కిందచూపిన విధంగా  బాగా వేచుకోవాలి.

2.శెనగపలుకులు బాగా వేగాక,వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోని , ఒక 5  నిమిషాలపాటు  చల్లారనివ్వాలి .

3.శెనగపలుకులు చల్లారాక , వాటి పై తొక్కని తీసేయాలి.

4.మళ్ళీ అదే పాన్ లో కొంచెం నూని వేసి ఒక నిమిషంపాటు వేడిఎక్కనివ్వాలి.

5.నూని కొంచెం వేడిఎక్కాక, అందులో ఆవాలు  వేసి కొంచెం చిటపటలు ఆడనివ్వాలి . చిటపటలు ఆడాక అందులో పచ్చిమిరపకాయలు ,కరివేపాకు ఆకులు వేసి ఒక 2 నిమిషాల పటు వేపాలి .

6.ఆవాలుని,పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు ఆకులను  ఒక ప్లేట్ లోకి తీసుకోని పక్కన ఉంచుకోండి.

7.మిక్సర్ జార్ తీసుకోని అందులో వేపిన శెనగపలుకులు, పచ్చిమిరపకాయలు, చింతపండు,ఉప్పు వెయ్యండి.

8.అన్నిటిని  మిక్సీ లో బాగా మెత్తగా రుబ్బండి  .

9.మెత్తగా రుబ్బిన పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకోని అందులో ఆవాలు ,కరివేపాకు ఆకులు వేసి బాగా కలపండి.

అంతే! ఎంతో రుచికరమయిన శెనగపలుకుల పచ్చడి తయ్యారు అయింది.
ఇది ఇడ్లీ /దోస/ఉప్మా/ఊతప్పం  లోకి చాల బాగుంటుంది.


ఈ రెసిపీ ని తప్పకుండ మీ ఇంట్లో తయ్యారు చేసి ఎలా ఉందొ చెప్పండి .

థాంక్ యూ ..





Comments