హాయ్ ఫ్రెండ్స్.. గుడ్ ఈవెనింగ్.ఈ రోజు నేను మీ అందరికి ఎంతో రుచికరమయిన మరియు ఆరోగ్యమయిన మహారాష్ట్రియన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ని పరిచయం చెయ్యాలి అనుకుంటున్నాను.
మన అందరికి తెల్సు, రోజులో బ్రేక్ ఫాస్ట్ తినడం అనేది ఎంత ముఖ్యమో .ఎన్నో పుస్త కాలలో మీరు చదివే ఉంటారు
బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల మనం రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటాము అని.
అందుకే ఈ రోజు నేను మీకు, మరటీస్ కి ఎంత ఇష్టమయిన బ్రేక్ ఫాస్ట్నిని
మీకు చెప్తాను.దీనిలో ముఖ్యమయిన పదార్ధము అటుకులు.అటుకులు మన సూపర్ మర్కెట్స్ లో ఎంతో సులభంగా దొరుకుతాయి.
ఈ
రెసిపీని
తినడం
వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.ఉదాహరణికి కొన్ని కిందన రాస్తున్న :
·
ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
·
గ్లూటెన్ శాతం తక్కువుగా ఉంటుంది.
·
సులభంగా అరుగుతుంది .
·
ప్రోటీన్ మరియు విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి.
·
తక్షణ శక్తి లభిస్తుంది.
ఇంత చెప్తోంది కానీ ఇంకా రెసిపీ పేరు చెప్పడం లేదు అని అనుకోకండి. మీ అందరికి ఈ రెసిపీ
యొక్క ఇంపార్టెన్స్ చెప్దామ్ అని అనుకున్న. సరే ఇంకా రెసిపీ పేరు చెప్పేస్తున్న --- "పోహా ".
తయ్యారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు :
1. అటుకులు - 1 కప్పు.
2. పచ్చిబఠాణీలు - 10 – 15.
3. క్యారెట్ - సన్నంగా తరుగుకోవాలి.
4. ఉల్లిపాయలు -సన్నంగా తరుగుకోవాలి.
5. టమాటా - సన్నంగా తరుగుకోవాలి.
6. కాలిఫ్లవర్ - సన్నంగా తరుగుకోవాలి.
7. అల్లం -సన్నంగా తరుగుకోవాలి.
8. పచ్చిమిరపకాయలు - సన్నంగా తరుగుకోవాలి.
9. శనగపలుకులు – 10.
10. నిమ్మకాయ - పెద్దది.
11. ఆవాలు - 1 టీస్పూన్.
12. జీలకర్ర - 1 టీస్పూన్.
13. మినపప్పు - 1 టీస్పూన్.
14. శనగపప్పు - 1 టీస్పూన్.
15. ఉప్పు- 1 టేబులుస్పూన్.
16. పసుపు - 1 టీస్పూన్.
17. కొత్తిమీర -సన్నంగా తరుగుకోవాలి.
తయారీ విధానం:
1. ముందుగా
ఒక గిన్ని తీసుకోని అందులో అటుకులు వేసి, అందులో కొంచెం నీళ్లు వేసి ఒక నిమిషం పాటు
బాగా కడగండి .తరువాత మొత్తం నీరు అంత పోయేటట్టు అటుకులని బాగా పిండి, పక్కన పెట్టుకోండి.
2. కడిగి
పక్కన పెట్టుకున్న అటుకులలో కొంచెం పసుపు, ఉప్పు,నిమ్మకాయ రసం వేసి, అన్ని బాగా కలపండి.
3. ఒక
పాన్ తీసుకోని, స్టవ్ మీద పెట్టి, అందులో కొంచెం నూని వేసి ఒక నిమిషం పాటు వేడి ఎక్కనివ్వండి.
4. ఆ పాన్
లో ఆవాలు వేసి కొంచెం చిటపటలు ఆడక దాంట్లో కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు,పచ్చిమిరపకాయలు,అల్లం
వేసి కొంచెం వేగనివ్వండి.
5. ఇప్పుడు
పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేగనివండి.ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక
అందులో క్యారెట్, పచ్చిబఠాణీ,కాలిఫ్లవర్, శనగపలుకులు వేసి బాగా వేగనివ్వండి.
6. పైన కూర ముక్కలు అన్ని కొంచెం వేగాక, పాన్ లో తరిగిన
టమాటా ముక్కలు వేసి, అన్ని పదార్ధాలు బాగా కలుపుకోవాలి .పాన్ మీద మూతపెట్టి, కూర ముక్కలని
ఒక 5 నిమిషములపాటు ఉడకనివ్వాలి.
7. టమాటా
ముక్కలు మెత్తబడ్డాక, పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న అటుకులని వేసి బాగా
కలుపుకోవాలి.మీకు
కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా ఈ సమయంలో పాన్ లో వేయచ్చు.
8. పాన్ మీద మూత పెట్టి, సన్నని మంట మీద ఒక 5 నిమిషముల పాటు ఉడకనివ్వండి.
9. అటుకులు
బాగా ఉడికి కింద విధంగా తయ్యారు అవుతుంది.
10.పోహా
తయ్యారు అయిపొయింది .దానిని ఒక ప్లేట్ లో పెట్టి మీ ఫ్యామిలీకి సర్వ్ చెయ్యండి.
సర్వ్ చేసేముందు కొంచెం సేవ్ వేసి సర్వ్
చేయండి. అంతే ఎంతో రుచికరమయిన పోహా తయారయింది.నన్ను నమ్మండి తప్పకుండ మీ పిల్లలకి నచ్చుతుంది.
ఇది చాల తక్కువ సమయంలో వండుకోవచ్చు.దీనికి నూని కూడా చాల తక్కువ పడుతుంది,అందువల్ల
బరువు తగ్గాలి అన్ని అనుకునేవాళ్లు తప్పకుండ ఇది ఒకసారి చేసి చుడండి.
అందరు తప్పకుండ ఈ వంటకం చేసి మీ సూచనలు చెప్పండి.
థాంక్ యూ..
Comments
Post a Comment