పచ్చి టమాటో ఆవకాయ


హలో ఫ్రెండ్స. గుడ్ ఆఫ్టేర్నూన్ . నేను రోజు మీ అందరికీ ఒక రుచికరమైన తెలుగు వంటకం పరిచయం చేయాలిఅనుకుంటున్నాను . దీన్ని మీరు 20 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు
మధ్యకాలంలో చాల మంది  తెలుగువాళ్లు విదేశాల్లో నివసిస్తున్నారు, అక్కడ మన రుచికరమైన పచ్చళ్లు,అవకాయలను మిస్ అవుతున్నారు. రుచిని మరిచిపోలేక కోరియర్ లో తెప్పించుకుంటున్నారు. కానీ ఆ అవకాయలు ఎన్ని రోజులు ఉండవు,అలాగని ప్రతిసారి మనీ పెట్టి అందరు తెపించుకోలేరు. 
 అందుకే నేను ఈరోజు మీకు పచ్చి టొమాటోలతో ఆవకాయ ఎలా పెట్టాలో  చెప్తాను.


 కావాల్సిన పదార్థాలు :

1.పచ్చి టమాటా కాయలు - 10
2.ఆవపిండి - 1 కప్పు
3.కారం పొడి - 3/4 కప్పు
4.ఉప్పు - 1/4 కప్పు
5.ఇంగువ - 1 టి స్పూన్
6.పసుపు - 1 టి స్పూన్
7.నూనె - 1 కప్పు



తయారీ విధానం:
1)   ముందుగా టమోటాలను  పొడిగా తుడిచి కింద చూపిన విధంగా కట్ చెయ్యాలి ( టమాటాలను నీటితో వాష్ చేయద్దు) .


2)   ఒక గిన్నెలో పైన చెప్పిన కొలత ప్రకారం ఆవపిండి, కారం పొడి, ఉప్పు, పసుపు, ఇంగువ తీసుకొని కింద చూపిన విధంగా కలపాలి



3)   పైన చెప్పిన పదార్థాలు అన్ని బాగా కలిపిన తర్వాత నూనె కూడా మిశ్రమంలో వేసి బాగా కలపాలి.

 
4)   మిశ్రమంలో టమాటో ముక్కలను కూడా వేసి, ఒక గరిటెతో పిండి పదార్ధం అంతా ముక్కలకి బాగా అంటే విధంగా కలపండి.


5)   ఒక 3 గంటలు తరువాత అవకాయను తినవచ్చును . ఒకరోజు తర్వాత ఆవకాయ ఊరి కింద విధంగా ఉంటుంది.


ఎంతో రుచికరమైన పచ్చి టమోటా ఆవకాయ రెడీ. చాలా సులభం కదా! దీన్ని మీరు పొద్దున తయారు చేసుకుంటే సాయంత్రానికి ఊరుతుంది. ఇది ఇడ్లీ, దోశ మరియు అన్నం లో కలుపుకుని తిన్న చాలా బాగుంటుంది

NOTE: ఆవపిండి మీ ఏరియా లో దొరక్కపోతే అప్పటికప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, దీనికోసం కింది పదార్థాలు అవసరం అవుతాయి.
    1.  ఆవాలు - 1 కప్పు .
2.  ఎండు మిర్చి - 10-15.
3.  ఉప్పు -1 ½ టేబుల్ స్పూన్.
4.  పసుపు - 1 టి స్పూన్.
5.  ఇంగువ - 1 టి స్పూన్.
పై పదార్థాలు అన్ని  మిక్సర్ లో మెత్తగా పొడి చేయండి, నూని వేసి బాగా కలిపి ,ఆ తరువాత టమాటో ముక్కలు కూడా వేసి బాగా కలపండి. 
ఇంట్లో చేసుకున్న ఆవపిండి కి మార్కెట్ లో కొనుకున్న ఆవపిండికి రుచి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది .
రెసిపీ మీకు నచినట్లయితే మీ ఫ్రండ్స్ కి షేర్ చేయండి.
థాంక్ యు 😀.


Comments